08/మార్చి/2021, ఇందు వాసరే, దినఫలాలు

0
08/మార్చి/2021, ఇందు వాసరే, దినఫలాలు

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
08, మార్చి , 2021 ఇందు వాసరే
రాశి ఫలాలు

మేషం
లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దలయందు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

వృషభం
వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి కలదు.
సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

మిధునం
సకాలంలో పనులను పూర్తిచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం
శుభ కాలం. మీ మీ రంగాల్లో శుభప్రదం అయినటువంటి ఫలితాలను పొందుతారు. దైవబలం కాపాడుతోంది. మంచి పనులను మొదలుపెడతారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది.
గురు ధ్యానం మంచిది.

సింహం
శుభ కాలం. తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.
గణపతి ఆరాధన చేస్తే మంచిది.

కన్య
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

తుల
అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా వారి నామాన్ని జపించడం ఉత్తమం.

daily horoscope
daily horoscope

వృశ్చికం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ కాలం. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి
లక్ష్మీధ్యానం శుభప్రదం.

ధనుస్సు
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబందించిన శుభవర్తలు వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టదేవతా శ్లోకం చదవాలి.

మకరం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
శివుడిని ఆరాధిస్తే మంచిది.

కుంభం
మొదలుపెట్టిన పనులలో ఆటంకాలను అధికమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.

మీనం
గ్రహబలం విశేషంగా ఉంది. శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

Leave a Reply

%d bloggers like this: