దిన ఫలాలు 06,మార్చి,2021 horoscope

1
46

ఓం శ్రీ గురుభ్యోనమః

శుభమస్తు

06, మార్చి , 2021 స్థిర వాసరే

రాశి ఫలాలు

మేషం

ఈరోజు

మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

వృషభం

ఈరోజు

చేపట్టే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య కార్యంలో బంధుమిత్రులను కలుపుకుపోవడం మేలు. ఇష్టదేవతా స్తోత్రము పఠిస్తే మంచింది.

మిధునం

ఈరోజు

మంచి పనులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ¢గోవింద నామాలు పఠించడం మంచిది_ .

కర్కాటకం

ఈరోజు

చేపట్టే పనుల్లో శుభం చేకూరుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలుచేస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. వేంకటేశ్వర స్వామి సందర్శనం శక్తినిస్తుంది.

సింహం

ఈరోజు

శుభ భవిష్యత్తు ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మేలుచేస్తుంది.

కన్య

ఈరోజు

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. దుర్గా శ్లోకం చదవాలి .

తుల

ఈరోజు

వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు మీపైన ఉన్నవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు. ముఖ్యమైన పనుల్లో జాప్యం వద్దు. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి ఫలితాలు పొందుతారు .

వృశ్చికం

ఈరోజు

కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం

ధనుస్సు

ఈరోజు

మీ ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసరంగా ఆందోళన పడవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త. ఈశ్వరుణ్ణి పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

మకరం

ఈరోజు

మంచి ఫలితాలున్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం

కుంభం

ఈరోజు

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. అనవసర ధన వ్యయం సూచితం. శారీరక శ్రమ పెరుగుతుంది. పంచముఖ ఆంజనేయ స్తోత్రము పారాయణ చేస్తే మంచిది.

మీనం

ఈరోజు

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. అందరిని కలుపుకుపోవడం ఉత్తమం. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది

1 COMMENT

Leave a Reply