Daily Horoscope – 5/3/2021

0
57
today horoscope
today horoscope

ఓం శ్రీ గురుభ్యోనమః

శుభమస్తు,

05, మార్చి , 2021 భృగు వాసరే

రాశి ఫలాలు

Daily Horoscope – 5/3/2021

మేషం

ఈరోజు

మీ మీ రంగాల్లో మిశ్రమంగా ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. గో సేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

వృషభం

ఈరోజు

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది

మిధునం

ఈరోజు

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమ ఫలిస్తుంది. బలమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. సమయానికి సరైన ఆహార నియమాలు పాటించాలి. ప్రసన్నాంజనేయ స్తోత్రము పారాయణ చేయాలి.

కర్కాటకం

ఈరోజు

శుభ ఫలితాలున్నాయి. బుద్ధిబలం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అష్టలక్ష్మి దేవి సందర్శనం శుభప్రదం.

సింహం

ఈరోజు

మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ.. ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది .

కన్య

ఈరోజు

శరీర సౌఖ్యం కలదు. మనసు చెప్పింది చేస్తే శుభం కలుగుతుంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అపరిచితులతో జాగ్రత్త. దైవారాధన మానవద్దు.

తుల

ఈరోజు

చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది .

వృశ్చికం

ఈరోజు

మనసుకు సౌఖ్యం కలుగుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్య, వినోద సుఖం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది.

ధనుస్సు

ఈరోజు

శుభకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. బంధు మిత్రులను కలుస్తారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ¢ఆదిత్య హృదయ స్తోత్రము పఠించడం మంచిది_ .

మకరం

ఈరోజు

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.

కుంభం

ఈరోజు

మనోబలాన్ని కోల్పోరాదు. మంచిపనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండక పోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. శని ధ్యానం శుభప్రదం.

మీనం

ఈరోజు

మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కొరకు చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

Leave a Reply