Daily horoscope, 04/03/2021

0
47
today horoscope
today horoscope

ఓం శ్రీ గురుభ్యోనమః

శుభమస్తు

04, మార్చి , 2021 బృహస్పతి వాసరే

రాశి ఫలాలు

మేషం

ఈరోజు

ఉత్సాహంతో ముందుకు సాగండి. సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. మనోబలం సదా రక్షిస్తుంది. యశోవృద్ధి, సౌభాగ్యసిద్ధి ఉన్నాయి. గోవింద నామాలు చదవాలి

వృషభం

ఈరోజు

ఒక వ్యవహారంలో ప్రశంసలను అందుకుంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి

మిధునం

ఈరోజు

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. అస్థిరబుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలహాలు సూచితం. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. చంద్ర శ్లోకం చదవండి.

కర్కాటకం

ఈరోజు

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. విఘ్నాలు పెరగకుండా చూసుకోవాలి. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవా

సింహం

ఈరోజు

మంచి కాలం. చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేస్తారు. ఇష్టదైవాన్ని తలచుకోవడం మంచిది.

కన్య

ఈరోజు

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

తుల

ఈరోజు

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.

వృశ్చికం

ఈరోజు

చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి

ధనుస్సు

ఈరోజు

మంచి జరుగుతుంది. సమాజంలో గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

మకరం

ఈరోజు

కార్యవిఘ్నాలు లేకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

కుంభం

ఈరోజు

గ్రహబలం తక్కువగా ఉంది. మీ కుటుంబసభ్యులతో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఇబ్బందికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శ్రీ రామ నామాన్ని జపించాలి

మీనం

ఈరోజు

ఎంత శ్రమిస్తే అంత ఫలితం వస్తుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు. వేంకటేశ్వరుని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి

Leave a Reply