Daily horoscope – 03/03/2021 దినఫలాలు 03/03/2021

0
57
today horoscope
today horoscope

ఓం శ్రీ గురుభ్యోనమః

శుభమస్తు

03, మార్చి , 2021 సౌమ్య వాసరే

రాశి ఫలాలు

మేషం

ఈరోజు

ధర్మసిద్ధి ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. సమయానికి నిద్రాహారాలు అవసరం. అనవసర ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృథా ఖర్చులు సూచితం. గోసేవ చేస్తే మంచిది.

వృషభం

ఈరోజు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు

మిధునం

ఈరోజు

శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధన శుభప్రదం

కర్కాటకం

ఈరోజు

మంచి సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. కనకధారా స్తోత్రం పఠిస్తే శుభదాయకం.

సింహం

ఈరోజు

శుభ కాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. ధన, ధాన్య అభివృద్ధి ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. శివనామస్మరణ చేస్తే మంచిది. .

కన్య

ఈరోజు

మిశ్రమ కాలం. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారి సహకారం లభిస్తుంది. ఇష్టదైవారాధన శ్రేయోదాయకం.

తుల

ఈరోజు

మంచి ఆలోచనా విధానంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు లాభిస్తాయి. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సాయం చేసేవారున్నారు. లక్ష్మీగణపతి సందర్శనం మేలు చేస్తుంది.

వృశ్చికం

ఈరోజు

గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బందిపెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కలహ సూచన ఉంది. గోసేవ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు

ధనుస్సు

ఈరోజు

శుభ కాలం. మీ పనితీరుతో ఉన్నతాధికారుల మనసులు గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. విష్ణు నామస్మరణ చేస్తే మంచిది.

మకరం

ఈరోజు

చేపట్టే పనుల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులను మెప్పించడానికి అధికంగా శ్రమించాలి. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే అవకాశముంది. ఉత్సాహంతో ముందుకు సాగండి. అంతా మంచి జరుగుతుంది. శ్రీరాముడి సందర్శనం శుభప్రదం.

కుంభం

ఈరోజు

పదోన్నతి అవకాశాలున్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిర నిర్ణయాలతో శుభం చేకూరుతుంది. వ్యాపారంలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

మీనం

ఈరోజు

తలపెట్టిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సాయం లభిస్తుంది. కొన్ని సమయాల్లో తరచూ నిర్ణయాలు మారుస్తుంటారు. కలహం సూచితం. దుర్గాదేవి సందర్శనం శుభదాయకం.

Leave a Reply