Daily horoscope 02/03/2021

0
62
today horoscope
today horoscope

Paragraph

ఓం శ్రీ గురుభ్యోనమః

ఓం శ్రీ గురుభ్యోనమః

శుభమస్తు

02, మార్చి , 2021 భౌమ వాసరే

రాశి ఫలాలు

 

మేషం

ఈరోజు

మంచి పనులు చేపడతారు.గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయారాధన శుభప్రదం .

 

వృషభం

ఈరోజు

మీ మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక వ్యవహారంలో అధికారుల మన్ననలను అందుకుంటారు. ప్రయాణ సౌఖ్యం కలదు. సాయి ఆరాధనా చేస్తే మంచిది .

 

మిధునం

ఈరోజు

ఆత్మవిశ్వాసంతో పనిచేయండి అనుకున్నది దక్కుతుంది. చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. అపార్థాలకు తావులేకుండా వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రము పఠిస్తే బాగుంటుంది.

 

కర్కాటకం

ఈరోజు

పెద్దల ఆశీర్వచనాలతో ఒక పనిలో ఆశించిన ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. సాయిబాబా సందర్శనం శుభప్రదం.

 

సింహం

ఈరోజు

శుభసమయం. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం .

 

కన్య

ఈరోజు

మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధనధాన్య లాభాలుంటాయి. ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు. తోటివారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఎట్టి పరిస్థితిల్లోనూ మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లక్ష్మీ నామాన్ని జపించడం ఉత్తమం.

 

తుల

ఈరోజు

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. వేంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు .

 

వృశ్చికం

ఈరోజు

మీ ఓర్పుకు ఇది పరీక్షా కాలం. మీ మీ రంగాల్లో.. ఆచితూచి ముందుకు సాగాలి. ఆలోచించి మాట్లాడాలి. లేదంటే అపకీర్తిని మూట కట్టుకుంటారు. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. శ్రీ రామరక్షా స్తోత్రం చదివితే మంచి జరుగును.

 

ధనుస్సు

ఈరోజు

శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. నీరసించకుండా పనిచేస్తే గొప్ప ఫలితాలు సాధిస్తారు. శతృవులపై నైతిక విజయం సాధిస్తారు. ముఖ్య విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. చెడు సావాసాల వల్ల మనోవిచారం కలుగుతుంది. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. శనికి తైలాభిషేకం శుభప్రదం.

 

మకరం

ఈరోజు

చిత్తశుద్ధితో పనిచేసి కార్యములందు విజయం సాధిస్తారు. ఒకవార్త మీ మనస్సుకు ఇబ్బందిని కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విఘ్నాల్ని కలిగించేవారు పక్కనే ఉంటారు. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

 

కుంభం

ఈరోజు

సకాలంలో పనులు పూర్తవుతాయి. దైవానుగ్రహంతో శుభం జరుగుతుంది. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో పురోగతి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. స్వస్థాన ప్రాప్తి ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

 

మీనం

ఈరోజు

మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. బుద్ధిబలంతో సమస్యలు తొలుగుతాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యలతో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మేలు.

Leave a Reply