Daily horoscope 1/03/2021

0
73
today horoscope
today horoscope

ఓం శ్రీ గురుభ్యోనమః

శుభమస్తు

01, మార్చి , 2021 ఇందు వాసరే

రాశి ఫలాలు

మేషం

ఈరోజు

చేపట్టిన పనులను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి.

వృషభం

ఈరోజు

మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తోటివారి ద్వారా సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.

మిధునం

ఈరోజు

మనోధైర్యంతో చేసే పనులు చక్కటి విజయాన్నిస్తాయి. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాదన మానవద్దు. శివారాధన శుభప్రదం.

కర్కాటకం

ఈరోజు

విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సుఖసంతోషాలతో కాలం గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. దైవబలం అనుకూలిస్తోంది. శివారాధన మేలు చేస్తుంది ..

సింహం

ఈరోజు

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. అవసరానికి తగిన ధనం చేతికి అందుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వర ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

కన్య

ఈరోజు

కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మానవద్దు.

తుల

ఈరోజు

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివ స్తోత్రం పఠిస్తే మంచిది

వృశ్చికం

ఈరోజు

వృత్తిపరంగా అనుకూలత ఉంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభానిస్తుంది.

ధనుస్సు

ఈరోజు

అనుకూల ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

మకరం

ఈరోజు

మధ్యమ ఫలితాలున్నాయి. పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.

కుంభం

ఈరోజు

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఇష్టులతో మరపురాని క్షణాలను గడుపుతారు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన ఉత్తమం.

మీనం

ఈరోజు

శుభ ఫలితాలున్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాలను నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శివుడిని ఆరాధిస్తే శుభదాయకం.

Leave a Reply