ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
27, ఫిబ్రవరి , 2021 స్థిర వాసరే
రాశి ఫలాలు
మేషం
ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ఆశించిన ఫలితాలున్నాయి. లక్ష్యాలను ఛేదిస్తారు. ఒక సంఘటన ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శుభప్రదం.
వృషభం
ఈరోజు
తలపెట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఈశ్వర ధ్యానం శుభదాయకం
మిధునం
ఈరోజు
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొద్దిపాటి సమస్యలు ఉన్నా మీ బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది
కర్కాటకం
ఈరోజు
ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. బుద్దిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయోదాయకం. .
సింహం
ఈరోజు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.
కన్య
ఈరోజు
స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించిన కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో ధైర్యం ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన చేస్తే మంచిది.
తుల
ఈరోజు
మిశ్రమ వాతావరణం సూచితం. బంధుమిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాల్లో ఆచి తూచి ముందుకు సాగాలి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రం పారాయణ చేయాలి.
వృశ్చికం
ఈరోజు
మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. సుఖసౌఖ్యాలు ఉన్నాయి. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో కాలం గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం .
ధనుస్సు
ఈరోజు
మధ్యమ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకుపోవడం ద్వారా సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోవద్దు. గోవిందనామాలు చదివితే శుభం జరుగుతుంది.
మకరం
ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వీడకండి. అనవసర కలహం సూచితం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది .
కుంభం
ఈరోజు
అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధనా శుభప్రదం .
మీనం
ఈరోజు
కీలక నిర్ణయాలను అమలు చేసే ముందు బాగా ఆలోచించి ముందు సాగాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలున్నాయి. శ్రీ లక్ష్మీగణపతి సందర్శనం శక్తినిస్తుంది.