మనం రోజూ వంటలలో వాడే దినుసుల్ని ఔషధాలుగా వాడే విధానం…
1. ఆవాలు
అవాలను ముద్దగా నూరి వేళ్ళపై రాస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అవాలను ముద్దగా నూరి చర్మం పై రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి.
2. జీలకర్ర
A. 5 గ్రాములు వేడి నీటితో తీసుకొంటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
B. 5 గ్రాముల పొడిని బెల్లంతో తీసుకొంటే మలేరియా లాంటి జ్వరాలు తగ్గుతాయి.
3. ధనియాలు
A. 5 గ్రాముల ముద్దను బియ్యం కడిగిన నీటితో తాగితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
B. ధనియాల పొడిలో ఉప్పు కలిపి అన్నంతో తీసుకొంటే ఆహారం జీర్ణం అయి సుఖ విరోచనం అవుతుంది.
4. మెంతులు
A. మెంతి ఆకు కూరగా వాడితే మలబద్దకం తగ్గుతుంది.
B. 2 లేక 3 గ్రాముల మెంతులు పెరుగుతో తీసుకొంటే అతిసారము తగ్గుతుంది.
5. వాము
A. 5 గ్రాముల వాము పొడి వేడి నీటిలో తీసుకొంటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
B. 1 లేక 2 గ్రాముల వాము పొడి తల్లి పాలతో ఇస్తే చంటి పిల్లలకు జలుబు, దగ్గు తగ్గుతాయి.
6. సోపు
సోపు నీటిలో నానబెట్టి ఆ నీరు తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది.
7. జాజికాయ
2 గ్రాముల చూర్ణం తేనె లో కలిపి తీసుకొంటే ఆకలి పెరుగుతుంది వాంతులు, విరోచనాలు తగ్గుతాయి.