Home PANCHANGAM 22, జనవరి, 2021 దిన ఫలాలు

22, జనవరి, 2021 దిన ఫలాలు

0

22, జనవరి , 2021 భృగు వాసరే

రాశి ఫలాలు

మేషం

మనోబలంతో చేసే పనులు సిద్ధిస్తాయి. మీలోని పారదర్శకత మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్య వ్యవహారాలలో ఆర్థిక సాయం అందుతుంది. ముఖ్య విషయాల్లో అస్థిర బుద్ధిని రానీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం.

వృషభం

సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. మానసికంగా ద్రుడంగా ఉంటారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమవుతుంది. లలితాదేవి నామస్మరణ శుభప్రదం.

మిధునం

సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. మానసికంగా ద్రుడంగా ఉంటారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమవుతుంది. లలితాదేవి నామస్మరణ శుభప్రదం.

కర్కాటకం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో స్థిరమైన ఫలితాలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులను పూర్తిచేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కీలక వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

సింహం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. నూతన వస్తువులు కొంటారు. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.

కన్య

వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదుగుతారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది

తుల

స్వల్ప ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి నిర్మాణం లేదా ఇంటి కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో పురోగతి కనిపిస్తుంది. ఇష్టదైవ నామాన్ని స్మరించాలి.

వృశ్చికం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి . మానసికంగా ద్రుడంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే మంచిది.

ధనుస్సు

శుభకాలం నడుస్తోంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు

మకరం

మధ్యమ ఫలితాలున్నాయి. మొదలుపెట్టిన కార్యాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. అవగాహనలేని పనులు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. బంధుమిత్రులతో వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.

కుంభం

ఆర్థికంగా శుభప్రదమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబందించిన వార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారాస్తవం పఠించాలి.

మీనం

గ్రహబలం అనుకూలిస్తోంది. ఏ పనిని తలపెట్టినా విజయంతంగా పూర్తిచేస్తారు. అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి పెద్దల ప్రశంసలు లభిస్తాయి. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మరువలేని శుభఫలాలను ప్రసాదిస్తాయి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.శుభకాలం.

Leave a Reply

%d bloggers like this: