పరహితమైన కార్య మతిభారముతోడిదియైన బూను స
త్పురుషులు లోకముల్పొగడ బూర్వము నందొకఱాల వర్ష
మున్ కురియగ జొచ్చినన్ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై
గిరినొక కేలనైతి నంట కృష్ణుండు ఛత్రముభాతి భాస్కరా!
తాత్పర్యం:
సజ్జనుల పట్టుదల సామాన్యమైంది కాదు. పరుల హితాన్ని కోరి, వారు చేసే కార్యం ఎంత భారమైనా సరే వెనుకడుగు వేయకుండా వెంటపడి మరీ సాధిస్తారు. అలాంటి వారే ప్రజలతో ప్రశంసలందుకొంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎలాగైతే ఎంత సునాయసంగా ఎత్తి చూపాడో అంత సులభంగా సత్పురుషులు కార్యభారాన్ని మోస్తారు.