అటల్ బిహారీ వాజ్పేయీ!

0
49
అటల్-బిహారీ-వాజ్పేయీ
అటల్-బిహారీ-వాజ్పేయీ

అటల్ బిహారీ వాజ్పేయీ 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అనే గ్రామంలో జన్మించారు .

ఈయన తల్లి కృష్ణాదేవి , తండ్రి కృష్ణబిహారి . 1957 లో జరిగిన ఎన్నికలలో తొలిసారిగా పార్లమెంటుకు ఈయన ఎన్నికయ్యారు .

ఆ తర్వాత మరో 10 సార్లు MPగా గెలిచారు . ఇప్పుడు మనకి తెలిసిన భారతీయ జనతాపార్టీ {BJP} ని అద్వానీతో కలిసి 1982 లో స్థాపించారు .

ఆయన జనతాపార్టీ ప్రభుత్వంలో 1977 లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు . ఈయన 1996 లో మొట్టమొదటి సారి 13 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు .

పార్లమెంటులో మెజారిటీ లేకపోవడంతో రాజీనామా చేశారు .

మళ్ళీ 1998 లో మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రధానమంత్రి అయ్యారు . ఇదే సంవత్సరంలో పోఖరణ్ లో అణుబాంబు పరీక్షను నిర్వహించారు .

దీనికి ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు . 1999 లో ఈయన దిల్లీ – లాహోర్ బస్సును ప్రారంభించారు.

కానీ అదే సంవత్సరంలో మెజారిటీ లేకపోవడటంవల్ల మళ్ళీ రాజీనామా చేశారు.పిల్లలంతా చదువుకోవాలని ! మళ్ళీ 1999 డిసెంబర్ నుంచి 2004 మే వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు .

అప్పుడు పిల్లలందరూ బడిలో చేరాలన్న లక్ష్యం తో “సర్వశిక్షా అభియాన్ ” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు .

అలాగే గ్రామీణ రహదారుల పథకం , జాతీయ రహదారుల అభివృద్ధి లాంటివి చేపట్టారు .

Leave a Reply