మదన్ మోహన్ మాలవీయా

0
62
మదన్-మోహన్-మాలవీయా
మదన్-మోహన్-మాలవీయా

మదన్ మోహన్ మాలవీయా:

మదన్ మోహన్ మాలవీయా 1861 డిసెంబర్ 25న ఉత్తరప్రదేశలోని అలహాబాదులో జన్మించారు.

బ్రజ్నాథ్ మాలవీయా, మూనాదేవి ఆయన తల్లి దండ్రులు. బ్రజ్ నాథ్ సంస్కృతంలో పండితుడు. మాలవీయ చిన్నప్పుడు వాళ్ళ నాన్న, తాతయ్యల దగ్గరే చదువుకున్నాడు. తరువాత చాలా వివిధ పాఠశాలలలో చదువు సాగించారు. 1884లో మ్యూర్ కళాశాల నుంచి బీఏ పట్టా పొందారు. సంస్కృతంలో ఏంఏ చదవాలనుకున్నారు. కానీ పెదరికం వల్ల చదువు కొనసాగించలేదు. 1891లో న్యాయవాద విద్యను పూర్తి చేసుకున్నారు. కొన్నాళ్లపాటు

న్యాయవాదిగా పనిచేసి… స్వాతంత్రయోద్యమంలో పాల్గొనేందుకు ఆా వృత్తిని విడిచిపెట్టారు.

ఆయన లాయరుగా ఉన్నప్పుడు ఉత్తరభారతదేశంలో హిందీని రాసేందుకు పర్షియా లిపిని వాడేవారు. మాలవీయ కృషి వల్ల పర్షియా లిపితో పాటు ఇప్పుడు హిందీ భాషను రాసేందుకు వాడుతున్న దేవనాగరి లిపిని కూడా వాడేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మాలవీయ గొప్ప సంఘసంస్కర్థ, ఆయన నివసించిన అలహాబాదు గంగా, యమునా నదులు కలిసే ప్రదేశం. ఇక్కడ నది స్నానం చేసేందుకు చాలామంది వచ్చేవారు. వాలాకు సాయం చేసేందుకు మాలవీయ సేవాదళ్ అనే సంస్థను స్థాపించారు.

Leave a Reply