దిన ఫలాలు

0

10, జనవరి , 2021 భాను వాసరే

రాశి ఫలాలు

మేషం

ఈరోజు

మీ ఓర్పుకు ఇది పరీక్షా కాలం. మీ మీ రంగాల్లో ఆచి తూచి ముందుకు సాగాలి. ఆలోచించి మాట్లాడాలి లేకుంటే అపకీర్తి పాలవుతారు. ప్రణాళికల ద్వారా విజయానికి దగ్గరవుతారు. శ్రీరామ రక్షాస్తోత్రం చదివితే మంచి జరుగుతుంది

వృషభం

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.

మిధునం

మనోధైర్యంతో ప్రయత్నించి చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పని చేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. రుణబాధ ఎక్కువ. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివాష్టకాన్ని చదివితే మంచి జరుతుంది.

కర్కాటకం

శుభకాలం. మొదలుపెట్టిన పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో అతి చనువు వద్దు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివుని సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది .

సింహం

చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు, వినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభాన్ని చేకూరుస్తుంది.

కన్య

సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. ఇష్టదైవారాధన శుభప్రదం.

తుల

పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. హనుమత్ ఆరాధనా శుభప్రదం.

వృశ్చికం

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం లభిస్తుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత ఉంది. ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారం తీసుకోవడం మంచిది. ద్వాదశ చంద్ర దోషం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోబలం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.

మకరం

శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితేచేపట్టే పనిలో శ్రమ ఫలిస్తుంది.

కుంభం

యశోవృద్ధి కలదు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. వేంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మంచిది.

మీనం

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థికంగా లాభం పొందుతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మ సిద్ధి ఉంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది

Leave a Reply

%d bloggers like this: