Home Stories ధనవంతుని నిధి !!

ధనవంతుని నిధి !!

0

అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు . అతని దగ్గర లెక్క కట్టలేనంత ధనం ఉండేది . అతనికి ఒక నిధి కూడా ఉంది , ఆ నిధి అతనికి అవసరంలేదు . కానీ దొంగలు పడి మొత్తం దోచేస్తారేమో అనే భయం కూడా ఉండేది . ఆ నిధిని ఏం చెయ్యాలా అని రోజు ఆలోచించేవాడు . ఒక రోజు దాన్నంతటిని అమ్మేయాలిని నిర్ణయించుకున్నాడు . కానీ ఆ నిధిని అమ్మడానికి అతని మనసొప్పలేదు . అయితే రోజు రోజు ఆ నిధి గురించి ఆలోచించలేక దాన్ని దాచేద్దాం అనుకున్నాడు .. అప్పుడు ఎక్కడ దాచాల అన్న ఆలోచన మొదలయ్యింది . అలా ఆలోచిస్తూ బయటకి వెళ్ళాడు . అలా చాలా దూరం వెళ్ళిపోయాడు . అప్పుడు అక్కడ అతనికి ఒక కాంపౌండ్ వాల్ కనపడింది .

అయితే అతను ఆ కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్న నెలలో దాచాలనుకున్నాడు . అప్పుడు చక చక ఇంటికి వెళ్ళాడు . ఆ నిధిని ఒక చోట పెట్టి రాత్రి అవ్వగానే ఆ కాంపౌండ్ వాల్ దగ్గరకు వెళ్ళాడు . అక్కడే ఒక దొంగ, చాటుగా కూర్చుని ఉన్నాడు . అతనిని ఆ ధనవంతుడు చూడలేదు . కాబట్టి ఆ ధనవంతుడు తవ్వకం మొదలుపెట్టాడు . మొత్తం తవ్వాక అతను ఆ నిధిని అందులో దాచి, కపెట్టేశాడు . అప్పుడు అతను తన ఇంటికి వెళ్ళిపోయాడు . ఇదే అదనుగా ఆ దొంగ కాంపౌండ్ వాల్ దగ్గరకు వచ్చి ఆ నిధినంతా దోచేశాడు . అప్పుడు ఆ మరుసటి రోజు ఆ ధనికుడు వచ్చి చూసేసరికి అక్కడ ఏమి లేదు . అది చూసి అతను చాలా బాధపడి బోరు బోరు మని ఏడవడం మొదలుపెట్టాడు . ఆ చుట్టుపక్క వాళ్ళు అంతా వచ్చారు . ఏమైంది అని అడిగారు . అప్పుడు ఈ ధనవంతుడు జరిగిందంత చెప్పాడు . అప్పుడు అక్కడ ఉన్న ఒక అతను ఇలా అన్నాడు ” నీకు ఆ ధనం అవసరంలేనప్పుడు , దాన్ని అమ్మేయాలన అలచన ఉన్నపుడు, దాన్ని దోచేస్తే ఏమైంది .. నీకేలాగో ఆ ధనం అవసారంలేదుకాదా” అని అన్నాడు . అప్పుడు ఆ ధనవంతుని కళ్ళు తెరుచుకున్నాయి . అప్పుడు ఆయన చెప్పింది నిజమే కదా అని ఆనందంగా , ఆ నిధి గురించి ఆలోచించకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు .

సూక్తి : మనకి అవసరంలేని దాని గురించి ఆలోచన అనవసరం .. దాన్ని ఎవరికైనా దానం చేయడం మంచిది .

Leave a Reply

%d bloggers like this: