బలవంతుడు నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచిమలచేత జిక్కి చావదె సుమతీ !
భావం : నేను బలవంతుడను నాకేమి భయమున్నది అని చాలమందితో నిర్లక్ష్యము చేసి పలికి విరోధము తెచ్చుకొనుట మంచిదికాదు . అది యెప్పుడును హానిని కలిగించును . మిక్కిలి బలముగలిగిన సర్పముకూడా చలిచీమలకు లోబడి చచ్చుచుండుట లేదా ?