Home Health Tips చిటికెడంత పసుపు చాలు !!

చిటికెడంత పసుపు చాలు !!

0

మనం పండగలకు కొత్త బట్టలు కోన్నుకుంటాం . అవి వేసుకునే ముందు పసుపు బొట్టు పెడతాం అలాగే ఆహ్వాన పత్రికలకు నాలుగు వైపులా పసుపు బొట్టులు పెడతాం .. ఎందుకంటే పసుపు శుభానికి సంకేతం . కానీ మీరు ఎప్పుడైనా అది ఎలా తయారవుతుందో ఆలోచించార ! దానిలోని ఔషద గుణాల గురించి ఆలోచించార !! సరే ఇప్పుడు మనం అది ఎలా తయారవుతుంది , అందులోని ఔషద గుణాలేంటి , ఇవ్వన్నీ తెలుసుకుందాం……

పసుపు ఎలా తయారవుతుంది :

పసుపు కొమ్మల్ని భూమిలో పాతితే మొక్కలొస్తాయి . ఈ కొమ్మలు దుంపల్లా పెరుగుతాయి .

ఆ కొమ్మల్ని తీసి ఉడకబెట్టి , ఆ తర్వాత ఎండబెట్టి పొడి చేస్తారు . దానినే పసుపు పొడి అంటారు.

ఈ కొమ్మల్లో కుంకుమ రాళ్ళు కలిపి పోసి చేస్తే కుంకుమ తయారవుతుంది .

ఆరోగ్య రక్ష :

మనం పసుపుని ఎన్నో రకాలుగా వాడతాం .. ముఖ్యంగా పూజల్లో . దీనిని పూజలో వాడారంటే కచ్చితంగా దీనికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి . అవేంటో ఇప్పుడు చూద్దాం .

1. ఇందులో విటమిన్ C,E,K,B6 ఉంటాయి .

2. ఇందులో రాగి,ఇనుము,జింక్ , పొటాషియం , సోడియం , నియాసిన్ , క్యాల్శియం , మాంసకృత్తులు , పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి .

3. వీటివల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది .

4. ఇందులో సూక్ష్మక్రిములని పోగొట్టే గుణం కూడా ఉంటుంది .

5. పసుపు మనల్ని అంటువ్యాధుల నుంచి రక్షిస్తుంది .

6. దీన్ని పాలలో గాని నీళ్ళల్లో గాని కలిపి తీసుకుంటే జలుబు,దగ్గు,జ్వరం లాంటివి రావు .

7. దీని వల్ల అరుగుదల క్రమంలో ఉంటుంది .

8. పసుపుని నీళ్ళల్లో కలిపి ఆవిరిపడితే ముక్కుదిబ్బడ తొలిగిపోతుంది .

9. గాయాల మీద పసుపు మంచి మందు .

10. కాన్సర్ లాంటి వ్యాదుల బారిన పడకుండా కాపాడుతుంది .

11. పసుపు తెలివితేటల్ని కూడా పెంచుతుంది .

12. ముసలితనంలో మతిమరుపు రానివ్వదు .

Leave a Reply

%d bloggers like this: