Home Uncategorized science and technology ఆర్గానిక్ / ఇనార్గానిక్ పదార్థాల మధ్య తేడా చూపించింది ఎవరు ?

ఆర్గానిక్ / ఇనార్గానిక్ పదార్థాల మధ్య తేడా చూపించింది ఎవరు ?

0

జాన్ జేకబ్ బెర్జీలియస్ …… ఈయన ఎవరో మీకు తెలుసా ? మనం మూలకాలను సంకేత నామాలతో రాస్తున్నాం కదా !{ex: hydrogen H } దీన్ని మొదటిసారి ప్రవేశపెట్టింది ఈయనే .

ఈయన స్వీడన్కు చెందిన 18,19 శతాబ్దాలలో రసాయనశాస్త్రవేత్త . ఈయన ఈ రసాయనశాస్త్రలో ఎన్నో పరిశోధనలు చేశారు . అందుకే ఈయనను ఆధునిక రసాయన శాస్త్ర పితామహుల్లో ఒకరిగా పరిగణించారు . ఈయన 1807 లో ప్రతిపాదన చేశారు .”రసాయన సమ్మేళనాల్లో రెండు రకాలుంటాయి. అవి జీవశక్తి ఉన్నవి “సేంద్రీయ పదార్థాలు ” { organic compounds } , జీవశక్తి లేనివి “విస్సేంద్రీయ పదార్థాలు ” { inorganic compounds } .

సేంద్రీయ పదార్థాలు అంటే పాలు ,పంచదార , నెయ్యి ,మొ .. విటిని క్రిమికిటకాలనుంచి సంపాదించవలసిందే . దీన్ని ఆర్టిఫీషియల్ గా తయారుచేయలేం . ఇక విస్సేంద్రీయ పదార్థాలు అంటే ఉప్పు లాంటి లవణాలు , బంగారం లాంటి లోహాలు . ఇవి ప్రకృతిలో సహజంగా దొరుకుతాయి . ఈ రెండు రకాలు పదార్థాల రసాయన ధర్మాలను అధ్యయనం చేసే శాస్త్రాలను “ఆర్గానిక్ కెమిస్ట్రీ ” ఇనార్గానిక్ కెమిస్ట్రీ ” అని పిలుద్దాం ” ఇవి జేకబ్ అన్న మాటలు . కానీ ఆశల సేంద్రీయ /విస్సేంద్రీయ విభజన ఎలా చేశారు ? దానికి కారణాలు ఉన్నాయి . ఉప్పును వేడి చేస్తే ఏమవుతుంది .. రంగు మారుతుంది కదా ! అదే పంచదారను వేడి చేస్తే ఏమవుతుంది .. మాడి మసైపోతుంది . ఇలా బూడిద అయ్యే పదార్థాలు వృక్ష , జీవజాతుల నుంచి లభించేవి .

కాబట్టి వాటిని సేంద్రీయ పదార్థాలు అన్నారు జేకబ్ . వేడి చేసిన రూపం మరనివి జడపదార్థాలు . అవి విస్సేంద్రీయ పదార్థాలు . ఇలా ఆర్గానిక్ / ఇనార్గానిక్ పదార్థాల మధ్య తేడా చూపించిన మొదటి వ్యక్తి జాన్ జేకబ్ బెర్జీలియస్.

Leave a Reply

%d bloggers like this: