sugar cane drink వేసవి ఔషదం !!

1
64
sugar cane drink
sugar cane drink

sugar cane drink తీపి లేని కాఫీ , షుగర్ లెస్స్ స్వీట్ అని ఈ మధ్య ప్రతీవాళ్ళు తీపి తగ్గించేశారు .. కానీ పంచదార లేని కాఫీ తగలేం కదా ! మనకు బాగా అలవాటు అయిన పదార్థం కాఫీ .. సరే గాని పంచదార ఎలా తయారు అవుతుందో తెలుసా !!

ఈ తియ్యని పదార్థం తయ్యారయ్యేది చెరకుగడలనుంచి . ఇది గడ్డి జాతి కి చెందిన మొక్క . చూడడానికి వెదురు లాగా ఉంటుంది కాని .. దీని నుంచి వచ్చే రసంతో బెల్లం ,పంచదార తయారుచేస్తారు .

అంతేకాకుండా చెరకు రసం తాగడం వలన మనలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది .. దీనిలో c విటమిన్ B విటమిన్ ఎక్కువగా ఉంటాయి ..sugar cane drink

ఇంకా ఇందులో పొటాషియం ,మెగ్నీషియం , ఇనుము , ఫాస్ఫరస్ , కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి .. ఇటువంటి పోషకాలు ఎక్కువగా ఉండడం వలన చెరకు రసం శెరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది ..

బెల్లం ఎలా తయారవుతుంది ..!

చెరుకు రసాన్ని పెద్ద ఇనుప రేకుతో చేసిన పెనంలో కాగబెడతారు . అప్పుడు రసంలో ఉన్న మురికంతా పైకి తేలుతుంది .. ఆ మాలినాన్ని తీసేస్తారు . తేగ పాకం వచ్చాక ఆ రసాన్ని వేరే పెనంలోకి మార్చి కలియబెడుతూనే ఉంటారు .

అప్పుడు ఆ పాకం మెల్లమెల్లగా గట్టిబడుతుంది . అలాంటి సమయంలో దాన్ని ముద్దలుగా చేసి ఆరబెడతారు . ఈ బెల్లం తయారీకి అనువైన రసం జూన్ , జులై నెలల్లో పండే చెరకు పంటల్లో లభిస్తుంది .sugar cane drink

sugar cane drink
sugar cane drink

పంచదార ఎలా తయారవుతుంది ..!

గుప్తులకాలం స్వర్ణయుగం అంటారు .. ఎందుకంటే ఆ కాలంలోని వాళ్ళు చాలా ఆధునికమైన ఆలోచనలతో నూతన వస్తువులను , పద్ధతులను కనిపెట్టారు .

ఆ క్రమంలో కనిపెట్టిన పదార్థమే ఈ పంచదార .. చెరకు రసాన్ని చక్కెరగా స్పటికీకరణ చెందే ప్రక్రియను కనిపెట్టారట . తేమగా ఉండి

పొడివాతావరణం కలిగిన నవంబరు నెలలో పం డే చెరకు పంట ఎక్కువ పంచదార దిగుబడినిస్తుంది .sugar cane drink

1 COMMENT

Leave a Reply