కానివాని చేత గసు వీసం బిచ్చి
వెంట దిరుగువాడె వెర్రివాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వదాభిరామ వినురవేమ !
భావం : ఓ వేమా ! హీనుడైన మనిషి చేతికి డబ్బును అప్పుగా ఇస్తే అది తిరిగి రాబట్టుకోవటానికి ఆ మనిషి వెంట తిరిగేవాడు పిచ్చివాడని చెప్పచ్చు . ఎందుకంటే పిల్లి కోడిని తిన్నపుడు కోడి ఎలా చనిపోయి శబ్దం లేకుండా ఉంటుందో అలాగే హీనమనిషి చేతిలోనికి పోయిన డబ్బు కూడా తిరిగిరాదు .